Crime

మధ్యప్రదేశ్‌ లో ఘోర విషాదం…!!!

109854299

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని షాడోల్ జిల్లాలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌ను ఇసుక మాఫియా మట్టుబెట్టింది పోలీసులు తెలిపారు. మృతుడు సత్నాలోని సింగ్‌పూర్ నివాసి అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ మహేంద్ర బగ్రీ గా గుర్తించినట్లు చెప్పారు. అతను షాడోల్ జిల్లాలోని బెహరి పోలీస్ స్టేషన్‌లో నియమించబడ్డాడు. వివరాళ్లోకి వెళ్తే… ఏ.ఎస్.ఐ. బగ్రీ తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి బడోలి గ్రామంలో ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళాడు. రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ఖాడోలి గ్రామం సమీపంలో ఇసుక లోడ్‌తో కూడిన ట్రాక్టర్‌ తమ వైపుకు రావడం గమనించారు. అతను తన వాహనం దిగి, ట్రాక్టర్ ట్రాలీ డ్రైవర్‌ను ఆపమని అడిగాడు, కానీ బదులుగా నడిపిన వ్యక్తి అతన్ని చంపేశాడు. డ్రైవర్‌ను రాజ్ రావత్ గా గుర్తించి ట్రాక్టర్ యజమాని కుమారుడు అశుతోష్ సింగ్‌తో పాటు  పోలీసులు అరెస్టు చేశారు. ట్రాక్టర్ యజమానిని అరెస్ట్ చేస్తే రూ. 30 వేలు రివార్డు ఇస్తామని సీనియర్ పోలీసు అధికారులు ప్రకటించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM
Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి.