నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేట మార్కెట్ యార్డులో ఉద్రిక్తత నెలకొంది. కడుపు మండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అరుణను రైతులు బయటకు లాక్కెళ్లారు. వ్యాపారులు, మార్కెట్ సిండికేట్ ఒకటయ్యి తమను ఆగం చేస్తున్నారని రైతన్న ఆగ్రహం వ్యక్తం చేసారు. వేరు శనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై వేరుశెనగ రైతులు దాడి చేశారు. దీంతో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. మార్కెట్ కమిటి చైర్మన్ ఛాంబర్ లోకి దూసుకెళ్లిన రైతులు చైర్మన్ అరుణను కార్యాలయం నుంచి బయటకి తీసుకొచ్చి కొట్టారు.
మద్దతు ధర లేక రైతుల ఆంధోళన…!!!
