పారిశ్రామిక సమ్మె, ట్రాన్స్ పోర్ట్ దేశవ్యాప్త సమ్మె కాకినాడ కె.ఎస్.పి.ఎల్ పోర్టు ఎదుట కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వం బంద్ నిర్వహించిచారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జాతీయ ఉపాధ్యక్షురాలు జి .బేబిరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, తదితరులు మాట్లాడుతూ… మోడీ హయాంలో 12 లక్షల కోట్ల కార్పొరేట్ల రుణాలు మాఫీ జరిగి ప్రపంచ కుబేరుల్లో చేరుతుంటే, గిట్టుబాటు ధర లభించని రైతులు రుణాలు చెల్లించలేక 1,60,000 మంది ఆత్మహత్యలకు మోడీ విధానాలే కారణమయ్యాయని విమర్శించారు.
రైతాంగం పోరాట సందర్భంగా కనీస మద్దతు ధరను చట్టం చేస్తానని హామీ ఇచ్చిన మోడీ మాట తప్పి రామాలయం వెనుక దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. తక్షణం రైతాంగ పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, కౌలు రైతులకు పంట రుణాలు, పంట నష్టపరిహారం భూ యజమానితో సంబంధం లేకుండా ఇవ్వాలని, ఏ పని చేసే కార్మికుడికైనా కనీస వేతనం 26,000 చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని డిమెండ్ చేసారు. ఈ కార్యక్రమంలో బండారు సత్యనారాయణ, రామకృష్ణ, రాజేష్, రాఘవ, నోవాహు, అనూక్, అఖిల భారత రైతు కూలి సంఘం చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.

