ప్రపంచం గర్వించదగ్గ మత్స్యకార జాతిని అవహేలను చేస్తూ విమర్శలు చేసిన ద్వారంపూడిని కాకినాడ నుండి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మళ్లిపూడి వీరు, టీ.డీ.పీ. నాయకులు తుమ్మల రమేష్ పేర్కొన్నారు. కాకినాడ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక రూపాయి కూడా తీసుకురాలేదన్నారు.
ద్వారంపూడి చేసిన అణిచిత వ్యాఖ్యలపై సోమవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లిపూడి వీరు మాట్లాడుతూ… కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చేస్తున్న అవినీతిని, భూకబ్జాలను, దోపిడిలపై పోరాటం చేస్తున్న వనమాడి కొండబాబును అవహేళన చేస్తూ విమర్శలు చేయడం ద్వారంపూడికి తగదని అన్నారు.
ద్వారంపూడి ఎన్ని పూజలు చేసినా ఆయన చేసిన పాపాలు తొలగిపోవని, టి.డి.ఆర్. బాండ్ల పేరుతో 500 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించి కేవలం రెండు కోట్లతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి ప్రగల్పాలు పలుకుతున్నాడన్నారు. ద్వారంపూడి దోపిడీపై కొండబాబు ప్రశ్నిస్తే గాని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు విడుదలైనట్లు ఎమ్మెల్యే చెప్పడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఏరిపిల్లి రాము, చోడిపిల్లి సతీష్, సంఘాని నాగేశ్వరరావు, మూగు రాజు, తుమ్మల కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.

