రాజకీయాలల్లో మతం గురించి మాట్లాడటం చాలా అమానుషమని, అది పెద్ద తప్పు, అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధంమని తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి కే.సీ.ఆర్. అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా రోజు హిందూ, ముస్లింలు అంటూ మతాలను వేరుచేసి, ఆ మతాల మధ్య గొడవలు పెడుతూ మాట్లాడితే అది ఎలెక్షన్ కమీషన్ కి కనబడదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హామీల గురించి అడిగితే నన్ను నీ గుడ్లు పికి గోళీలు ఆడుతా, నీ పేగులు తీసి మేడల వేసుకుంటా, నిన్ను పండబెట్టి తొక్కుతా అని మాట్లాడితే ఈ.సీ. కి కనిపించదా అని అడిగారు. నేతన్నల కోసం మాట్లాడితే మాత్రం ఈసీ నా మీద బ్యాన్ పెట్టిందని అన్నారు. ఇందంతా ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆయన అన్నారు.
మతాల మధ్య చిచ్చుపెట్టడం మంచిదికాదు… -కే.సీ.ఆర్.-

