టీ.డీ.పీ. ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోకస్ మంగళగిరిపై పడింది. అక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు తెలిపారు. జరిగిన టీ.డీ.పీ. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత ఎన్నికల్లో టీడీపీ మంగళగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా నేను ఎప్పుడూ మంగళగిరిని విడిచిపెట్టలేదని అన్నారు. మంగళగిరి ప్రజలతో తాను పూర్తిగా మమేకమయ్యానని తన సొంత నిధులతో నియోజకవర్గంలో 27 సంక్షేమ పథకాలు అమలు చేశానని లోకేష్ చెప్పారు.
మంగళగిరి నుంచి వెనక్కి వెళ్లే ప్రశక్తేలేదు… -లోకేష్-
