మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు, నూతక్కి, కుంచనపల్లి గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… టీ.డీ.పీ. 2024 లో అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే పెన్షన్ రూ.4 వేలకు పెంచి వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల నా దృష్టికి తీసుకొచ్చారన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యే గా ఆర్కే కి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లాడని యదేవచేసారు. ఈ ఎన్నికల్లో నాకు అవకాశం ఇవ్వాలని కోరారు. పేదలకు 20 వేల ఇళ్లు, ప్రభుత్వ భూముల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వారికి పట్టాలు ఇస్తామని అన్నారు గ్రామాల్లో డ్రైనేజ్, ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ద్వారా సురక్షిత త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
మంగళగిరి నియోజకవర్గం రచ్చబండ కార్యక్రమాల్లో లోకేష్ వాగ్దానం…

