గడిచిన చరిత్ర పరిశీలిస్తే మంగళగిరిలో గత రెండు దఫాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవి తప్పక విజయం సాధిస్తారని రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 31న మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఈ నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన ధాఖలాలు ఎక్కడా లేవని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి నారా లోకేష్ ఓటమి తధ్యమని అన్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెనుకబడిన సామాజిక వర్గానికి (చేనేత సామాజిక వర్గం) చెందిన వ్యక్తి పోటీలో నిలుబడుతున్నారని అన్నారు.

