ఆంధ్ర రాష్ట్రం ప్రవేవపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ జీ.ఓ. ను రద్ధుచేయలని ప్రత్తిపాడు నియోజకవంర్గంలో బార్ అసోసియేషన్ నిరసన వ్యక్తంచేసారు. దీని వల్ల చిన్న, సన్నకారు రైతులకు భూహక్కు పై నీలినీడలు కమ్ముకునే అవకాశముందని న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అక్టోబర్-31-2023 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రవేశపెట్టిందని అన్నారు.
ఈ యాక్ట్ ప్రకారం చిన్న, సన్నకారు రైతుల భూములపై హక్కును, అర్హత, అనుభవం కోల్పోయి ప్రభుత్వం జిల్లాలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోతుందని తెలిపారు. ప్రభుత్వం చేత నియమింపబనడి అధికారుల చేతుల్లోకి ప్రజల భూహక్కులు వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తంచేసారు.
