ఒడిశాలోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం అంగుల్ వెళుతున్న గూడ్స్ రైలు రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్, హెచ్.ఎస్. బజ్వా మాట్లాడుతూ.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ఇప్పటికే ఒక వ్యాగన్‌ని రీ-రైల్ చేయడం జరిగిందని, మరొక వ్యాగన్‌ను త్వరలో రీ-రైల్ చేస్తామని చెప్పారు.
ఇప్పటికే ఒక వ్యాగన్ మళ్లీ పట్టాలెక్కగా, రెండో వ్యాగన్ ఒకటి లేదా గంటన్నరలోపు మళ్లీ పట్టాలెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైలు చాలా నెమ్మదిగా కదులుతున్నందున ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. పట్టాలు తప్పడానికి గల కారణాన్ని మేము అంచనా వేస్తున్నామని అధికారి తెలిపారు.

