కాకినాడ నగరం ఇంద్రపాలెంలో అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ కోరేగావ్ స్మారక స్థూపం వద్ద మృతవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ… పీష్వా బ్రాహ్మణులపై మహార్ పోరాట యోధుల యుద్ధ విజయానికి చిహ్నమే భీమా కోరేగావ్ అని అన్నారు. 500 మంది మహా వీరులు 28 వేల మంది పీష్వా బ్రాహ్మణ సైన్యంతో మహారాష్ట్ర కోరే గావ్‌లోని భీమా నది వద్ద భీకర యుద్ధం చేసి 1818 జనవరి 1న విజయం సాధించారని అన్నారు.
భీమా కోరేగావ్ స్ఫూర్తితో తమ హక్కుల కోసం దళితులందరూ ఐక్యంగా పోరాడాలని దళిత సీనియర్ నాయకులు అయితా బత్తుల రామేశ్వరరావు, బుద్ధ విహార్ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ జి. భానుమతి, తదితరులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే . ఎస్ శ్రీనివాస్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కే. సింహాచలం, దళిత సంఘాల నాయకులు భయ్యా రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
భీమా కోరేగావ్ దళితుల ఆత్మగౌరవానికి స్ఫూర్తి…

