జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భీమవరం పర్యటనలో పలువురు ప్రముఖుల ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. హెలీకాప్టర్ ద్వారా భీమవరంలో అడుగు పెట్టిన ఆయన నేరుగా మాజీ రాజ్యసభ సభ్యురాలు, తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లి కలిశారు. అనంతరం టీ.డీ.పీ. నేతలు పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రామరాజు, ఆరిమిల్లి రాధాకృష్ణ, అంగర రామ్మోహన్, తదితర నాయకులతో సుమారు 40 నిమిషాల పాటు పలు కీలక అంశాలపై చర్చించారు.
భీమవరం పర్యటనలో పవన్ కళ్యాణ్ కీలక భేటీలు…

