భారత రాజ్యాంగమే నేడు భారత దేశానికి దిశ నిర్దేశం చేసే అమూల్యమైన వ్యవస్థ అని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సూర్య కళామందిర్ లో నిర్వహించిన భారత రాజ్యాంగమే దళితుల అజెండా బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ దళితులకు జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు పై నిరంతర పోరాటం చేసి అన్యాయానికి గురైన బాధితులకు బాసటగా నిలవడం జరుగుతుందని ధైర్యం చెప్పారు. దళిత మైనార్టీల పై జరుగుతున్న దాడుల నియంత్రణకు తమ సంస్థ పోరాడుతుందని దళితులు సమాజంలో ఎవరికీ తీసుపోకుండా జీవించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సిద్ధాంతుల కొండబాబు తెలిపారు.
భారత రాజ్యాంగమే దేశానికి దిశా నిర్దేశం…

