భారతదేశంతో సహా గ్లోబల్ మార్కెట్‌లో ఆసూస్ సంస్థ తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ రోగ్-8 సిరీస్‌ను ప్రవేశ పెట్టింది. ఇది కొత్త డిజైన్ తో మరింత శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో రానున్నట్టు తెలిపింది. ఇది మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందించనుంది. ROG 8 సిరీస్ గరిష్టంగా 24 GB LPDDR5X RAM మరియు 1 TB UFS 4.0 నిల్వతో అందించబడుతుంది. రెండు పరికరాలు ఆండ్రాయిడ్ 14-ఆధారిత ROG UIతో పని చేస్తాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లు 65W హైపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బేటరీ లో వస్తుంది. ప్రముఖ ఫీచర్లు, కనెక్టివిటీ పరంగా చూస్తే ROG 8 సిరీస్‌లో 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ స్పీకర్లు, 5-మాగ్నెట్ స్టీరియో స్పీకర్, హెడ్‌ఫోన్ స్పేషియల్ సౌండ్ కోసం Dirac Virtuo, తదితర సెన్సార్ లతో రానున్నట్టు సంస్థ తెలిపింది.
ASUS ROG ఫోన్ 8, ఫోన్ 8 ప్రో ధర ఈ కిందవిదంగా ఉన్నాయి.
ROG 8 ప్రో ఎడిషన్ 24GB/1TB – రూ. 119,999
ROG 8 ప్రో 16GB/512GB రూ. 94,999
