ఈ నెల 9 నుండి వాయువ్య భారతదేశంలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐ.ఎం.డీ. ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అలాగే కర్ణాటక, కేరళ, కొంకణ్, గోవా వంటి తీరప్రాంతాలలో తదుపరి 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఐ.ఎం.డీ. సూచన ప్రకారం,రాబోయే ఐదు రోజుల్లో తూర్పు, తూర్పు-మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు కొనసాగే అవకాశం ఉంది. రాబోయే ఐదు రోజుల పాటు మహారాష్ట్ర, కోస్తా, ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఐ.ఎం.డీ. గోవాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
భారతదేశంలో నైరుతి తీరం అంతటా భారీ వర్షాలు… -ఐ.ఎం.డీ.-