అమలాపురం రూరల్ రోళ్లపాలెం లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం లో ఇల్లు కోల్పోయిన రాయుడు సత్యనారాయణ కుటుంభ సభ్యులకు 10,000 రూపాయలు, ఆర్థిక సహాయం మరియు నిత్యా వసరాలు అయిన బియ్యం, బట్టలు సరుకులను రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించేందుకు తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్. సి. బొమ్మి ఇజ్రాయిల్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్యనారాయణ, చెల్లుబోయిన శ్రీనివాసరావు సంసాని, నాని దొమ్మేటి, రాము నక్కా, తదితరులు పాల్గొన్నారు

