Exclusive

భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి…

WhatsApp Image 2024-02-29 at 3.19.55 PM

భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాల అమలు చేయాలని ఏ.పీ. బిల్డింగ్& అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పిలుపును ఇచ్చారు. ఇందులో భాగంగా కాకినాడలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రపాలం అంబేద్కర్ విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మికుల సంగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి. అన్నవరం అధ్యక్షతన నిరసన ధర్నా జరిగింది.

ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ఒకే తరహాలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని, ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న పథకాలు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అమలు చేయాలని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న నిధులు సంక్షేమ బోర్డుకి తిరిగి జమ చేయాలని, లేకుంటే ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులు విస్తృతంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

తోకల ప్రసాద్ మాట్లాడుతూ… భవన నిర్మాణ కార్మికుల నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుండి ఇప్పటివరకు అనేక కోట్ల రూపాయలు ప్రభుత్వం దుర్వినియోగించిందని అన్నారు. భవన నిర్మాణ కార్మికులను మోసం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నానరు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.టీ.యూ.సీ. నగర అధ్యక్షులు పప్పు ఆదినారాయణ, ఎమ్మెస్, అర్జున్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.