Exclusive

భద్రాద్రికి తరలిన శ్రీరామ రధోత్సవ పాదయాత్ర…

WhatsApp Image 2024-02-04 at 2.51.56 PM

వాసుదేవ గురుస్వామి (ఉంగరాల వీర వెంకట సుబ్బారావు) ఆధ్వర్యం లో భద్రాచల శ్రీరామ రథోత్సవ పాదయాత్ర సమితి బృందం 400 మంది హనుమ దీక్షా పరులతో ప్రయాణమయ్యింది. ఆదివారం ఉదయం కాకినాడ స్వయంభూ భోగిగణపతి పీఠంలో బ్రహ్మముహూర్తం నందు తొలిపూజలు నిర్వహించి అచ్చంపేట నుండి గొంచాల మీదుగా కాలినడకతో శ్రీరామ రథం లాగుతూ సామర్లకోట జాతీయ రహదారి పై భద్రాచలం తరలి వెళ్లారు.

వాసుదేవ గురుస్వామి మాట్లాడుతూ… 13వ వార్షిక యాత్ర 10రోజుల్లో పూర్తి చేసి భారీ అన్న సమారాధన చేస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో గొంచాల పంచాయితీ కల్పించిన స్థలంలో రు. 25 లక్షలతో నిర్మిస్తున్న పాదయాత్ర రామాలయం ఏడాదిలో పూర్తి చేయడ జరుగుతున్నదన్నారు. యాత్ర లో రోజుకు రు.70 వేల ఖర్చుతో ఉదయం సాయంత్రం అల్పాహార భోజన వసతి ఏర్పాట్ల ను దాతలు అందిస్తున్నారన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.