Exclusive

బేవరేజ్ హమాలీలకు న్యాయం చేయాలి…

WhatsApp Image 2024-03-01 at 5.42.45 PM

బేవరేజ్ హమాలీల రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు సామర్లకోట బేవరేజ్ డిపో వద్ద హమాలీలు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వి. కొండలరావు మాట్లాడుతూ… గత సంవత్సరం 2023 అక్టోబర్ నెలతో ఎగుమతి రేట్లు కు సంబంధించి అగ్రిమెంట్ ముగిసిందన్నారు. నవంబర్ నుండి రేట్లు పెంచి నూతన ఒప్పందం అమలు చేయవలసి వుందన్నారు.

ఎం.డి. ని నాలుగు సార్లు కలసి వినతి పత్రం అందజేయడం జరిగిందని, ఎన్ని సార్లు కలసి మాట్లాడినా… కాంట్రక్టర్ ను పిలిపించి చర్చలు జరిపుతాము అనిచెప్పి మూడు నెలలు నుండి కాలయాపన చేస్తూ వస్తున్నారన్నారు. ఒక ప్రక్క నిత్యావసర వస్తు ధరలు ఆకాశాన్ని అంటాయని, ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంటు చార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయన్నారు.

ఈ పరిస్థితిలో రోజూ వచ్చే కూలితో హమాలీ కుటుంబాలు గడవక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే కార్పొరేషన్ యాజమాన్యాలు కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి వేతన ఒప్పందం అమలు చేయాలని, లేని పక్షంలో సమ్మె లోకి వెళ్ళవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శిలు బి. ఆదినారాయణ, వి. అప్పలారాజు హమాలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.