ఆంధ్ర ప్రదేశ్ సీ.ఎం. పై జరిగిన గులక రాయి దాడిలో నిందితుడిగా ఉన్న సతీష్ బైల్ పై బయటకు వచ్చాడు. ఈ సందర్బంగా అతడు మాట్లాడుతూ… సీఎం జగన్ పై గులకరాయి దాడి కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పాడు. పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న రెండో రోజు అర్ధరాత్రి 11 గంటలకు పోలీసులు అతడిని తీసుకెళ్లారు. సీ.ఎం. పై గులకరాయతో దాడి చేసినట్లు ఒప్పుకోమంటూ పోలీసులు తుపాకులు పెట్టి బెదిరించారని చెప్పాడు. సీ.ఎం. పై దాడి చేసినట్లు కేసు ఒప్పుకుంటే పోలీసులు డబ్బులు ఇస్తామన్నారని అన్నాడు. అయినా తాను దాడి చేయలేదు కాబట్టి ఒప్పుకోలేదన్నాడు. సీ.ఎం. ప్రచార సమయంలో తాము వివేకా స్కూల్ ప్రాంతంలో లేమని, ఫ్లైఓవర్ దగ్గర ప్రచారంలో మాత్రమే చూసామని అన్నాడు.
బెయిల్ పై విడుదలైన గులకరాయి నిందితుడు సతీష్…

