లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియడానికి మరికొన్ని రోజుల సమయం ఉన్నందున, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అత్యధికంగా లాభపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు ఏకపక్షంగా ఉన్నాయని, తృణమూల్ కాంగ్రెస్ నేతలు నిరాశకు గురయ్యారని అన్నారు.
ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… 2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ పనితీరు గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ గరిష్ట విజయాన్ని సాధిస్తుందని అన్నారు. బెంగాల్ ఎన్నికల్లో TMC పార్టీ ఉనికి కోసం పోరాడుతోందన్నారు. గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీ.జే.పీ. అత్యధిక విజయాన్ని సాధిస్తోందన్నారు.

