దాదాపు 137 మంది ప్రయాణికులతో అబెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక లోపంతో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. తిరువనంతపురం-బెంగళూరు సర్వీస్ మధ్యలో ఈ సమస్యను ఎదుర్కొవడంతో ల్యాండింగ్‌కు దారితీసిందని విమానాశ్రయంలోని వర్గాలు తెలిపాయి.
ల్యాండింగ్ తరువాత ప్రయాణీకులందరూ విమానం నుండి దిగారు, అయితే సాంకేతిక సిబ్బంది లోపాన్ని పరిశీలించడం ప్రారంభించారు. సాంకేతిక సమస్య కారణంగా విమానాన్ని తిరుచిరాపల్లికి మళ్లించాని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి ధృవీకరించారు. బెంగళూరుకు విమానాన్ని నడపడానికి ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
