డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో తెలుగుదేశం బీ.సీ. ఆత్మీయ సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎం.ఎల్.ఏ. బుచ్చిబాబు హజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బీ.సీ.లకు సంక్షేమంలోను, రాజకీయాల్లోను ప్రధాన్యతను కల్పించింది కేవలం తెలుగు దేశం పార్టీ మాత్రమే అని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్దికి నందమూరి తారక రామారావు ఎంతగానో కృషి చేసారన్నారు. తదనంతరం నారా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వారికి మరింత ప్రాధాన్యతను కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం.ఎల్.ఏ. బుచ్చిబాబు, కార్యకర్తలు, బీ.సీ. కార్యకర్తలు, తదితరులు భారి ఎత్తున తరలి వచ్చారు.
బీ.సీ. ల సంక్షేమం టీ.డీ.పీ. తో నే సాద్యం…

