బీహార్‌లోని బెగుసరాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారని అక్కడ పోలీసులు వెళ్లడించారు. మంగళవారం ఉదయం, ఆటో రిక్షా, ఐదుగురు వ్యక్తులతో హతిదా జంక్షన్ నుండి బెగుసరాయ్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఆటోలో ఉన్న ఐదుగురు డ్రైవర్‌తో పాటు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం… ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని ఇంకా గుర్తించలేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.
బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఢీకొన్న ఆటో రిక్షా, కారు…

