వై.సీ.పీ. ప్రభుత్వం బీసీలు అధిక ప్రాధాన్యతనిచ్చి జరగబోయే ఎన్నికల్లో బీ.సీ. అభ్యర్దులను నిలబెట్టనున్నట్టు వెళ్లడించింది. ఇందులో భాగంగా రాము, జోగి రమేష్ ఇద్దరూ గౌడ (బీసీ) సామాజిక వర్గానికి చెందినవారిని అభ్యార్ధులుగా ప్రకటించింది. వైఎస్సార్సీపీ విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ ఎం.పీ. బొత్స ఝాన్సీని ప్రకటించింది.
విశాఖపట్నం సిట్టింగ్ ఎం.పీ. ఎం.వీ.వీ. సత్యనారాయణ వైజాగ్ ఈస్ట్ సెగ్మెంట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు వెళ్లడించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేశారు. 6 మంది లోక్సభ అభ్యర్థులు, 15 మంది అసెంబ్లీ అభ్యర్థులను వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ ప్రకటించింది.

