Political

బీజేపీ-టీఎంసీ ఘర్షణకు దారితీసిన బెంగళూరు పేలుళ్ల నిందితుల అరెస్ట్…

bengaluru-blast

పశ్చిమ బెంగాల్‌లోని దిఘా నుండి ఇద్దరు రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితులను అరెస్టు చేయడం రాజకీయంగా దుమారాన్ని రేపింది. సి.ఎం. మమతా బెనర్జీ హయాంలో బెంగాల్ ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామమని, దానికి టి.ఎం.సి. ప్రతినిధి అని బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్‌లో పేర్కొన్నారు. దానికి ప్రతి స్పందనగా టీ.ఎం.సీ. నేత కునాల్ ఘోష్ కౌంటర్ ఇస్తూ.. కొంటాయ్ నుండి ఏ కుటుంబం, బీ.జే.పీ. ప్రధాన నాయకుడు చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో మనందరికీ తెలుసని అన్నారు

ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసిన కొత్త దిఘా హోటల్, బిజెపి నేత సువేందు అధికారి తండ్రి సిసిర్ అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న కొంటాయి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. సువేందు సోదరుడు సౌమేందు ఈసారి కొంటాయి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

తన పేరును ఈ కేసులోకి లాగడంపై సువెందు స్పందిస్తూ.. బెంగాల్ ఇప్పుడు అంతర్జాతీయ క్రిమినల్ మిలిటెంట్లకు కార్యకలాపాలు నిర్వహించేందుకు ఒక ఫ్రీ జోన్ గా పదే పదే రుజువైందని అన్నారు. కూచ్‌బెహార్‌లోని దిన్‌హటాలో జరిగిన ర్యాలీలో మమత మాట్లాడుతూ… బెంగాల్ పోలీసులకు మొదటి సమాచారం అందిన రెండు గంటల్లో వీరిద్దరినీ అరెస్టు చేయడం తమ సమర్థతకు నిదర్శనమని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.