రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని కాకినాడ మార్వాడి సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన రామరాజ్య శోభాయాత్ర అత్యంత ఉత్సవ వాతావరణంలో భారీ ఎత్తున రాముని వేషధారణలో ప్రదర్శనలు ఊరేగింపు సాగింది. ఈ శోభాయాత్రను పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాట్లాడుతూ… సుమారు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం భరత జాతి గర్వించే విధంగా భవ్య రామాలయ నిర్మాణం పూర్తి చేసుకోవడం దేశ ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున మార్వాడి సమాజం ముందుకు రావడం అభినందనీయం అన్నారు. రామ రాజ్యంలో దేశ ప్రజలు సుభిష్టంగా ఉండాలని ఆయన రామున్ని ప్రార్థించినట్లు తెలిపారు.
బాల రాముడి ప్రాణ ప్రతిష్ట విజయవంతం… -కాకినాడ మాజీ కార్పొరేటర్-

