Exclusive

బాదితులను ప్రభుత్వమే ఆదుకోవాలి… -యనమల కృష్ణుడు-

WhatsApp Image 2023-12-06 at 7.55.13 AM

టీ.డీ.పీ. ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన యనమల కృష్ణుడు మిచౌంగ్ ప్రభావానికి గురయిన తొండంగి మండలం చోడిపల్లి పేట మత్స్యకారులను, కోదాడ ఏవి నడరం రైతులను అధికారులతో వెళ్లి పరామర్శించారు. మిచౌంగ్ తీవ్ర తూఫాన్ కారణంగా రాష్ట్రమంతా అల్లకల్లోలం అయ్యిందన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మిచౌంగ్ తూఫాన్ కారణంగా ఒకవైపు పంట పొల్లల్లోకి నీరు చేరడంతో పంట నాశనమయ్యిందని, మరో వైపు వేటకు వెళ్లకపోవడంతో మత్స్యకారులు ఆర్ధికంగా నష్టపోయారని అన్నారు. నష్టపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమెండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టీ.డీ.పీ. ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు, మత్స్యకార నాయకులు కోడా వెంకటరమణ,పేకెటి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.