వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికల ప్రకటన మేరకు ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీ డనంగా కేంద్రీకృతమై ఉన్నదని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రకటనలో తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారు. పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ, 2వ తేదీ నాటికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, డిసెంబరు 3 నాటికి నైరుతి బంగాళాఖాతంపై తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ, డిసెంబర్ 4వ తేదీ సాయంత్రానికి చెన్నై-మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ ను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు హెచ్చరించారు.
తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో మత్స్యకారులు ఈనెల 5వ తేదీ వరకు సముద్రంలో చేపలు వేటకు వెళ్లరాదని ఆయన స్పష్టం చేశారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని డిసెంబర్ 5వ తేదీన ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద న్నారు.