బీ.జే.పీ. ప్రభుత్వం రైతు, వ్యవసాయ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా-కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలోగ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ సి.పి.ఐ., రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఆల్ ఇండియా ట్రేడ్ కాంగ్రెస్ ఏ.ఐ.టీ.యూ.సీ. ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో విస్తృతంగా కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేసారు.
ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ… కేంద్ర బీ.జే.పీ. ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాన్ని తీసుకొచ్చిందని, ఆ చట్టాలను పార్లమెంట్లో ఆమోదించాలని ప్రయత్నం చేయగా సుమారు 500 పైన రైతు సంఘాలు కలిసి ఢిల్లీ నడిరోడ్డుపై సంవత్సరం పాటు సుదీర్ఘమైన పోరాటం చేశారన్నారు. ఆ పోరాటానికి మోడీ వెనక్కి తగ్గి ఆ జీవోలను పార్లమెంట్లో ప్రవేశపెట్టి రద్దు చేస్తానని చెబుతూనే ఆ తీర్మానాలు ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు, సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 16 న దేశవ్యాప్త గ్రామీణ బంద్…

