సామాజిక ఫించన్ల పంపిణీని ప్రభుత్వ ఉద్యోగి ద్వారా మాత్రమే గౌరవప్రదంగా అందించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తేవాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. వృద్దులకు, వితంతువులకు, దివ్యాంగ్యులకు, ఒంటరి మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు, హెచ్.ఐ.వీ. వ్యాధి గ్రస్తులకు ఇస్తున్న ఫించన్లను వారికి ఇచ్చినట్టుగా తీసే ఫోటోలను ప్రభు త్వ రికార్డులకు మాత్ర మే పరిమితం చేయాలన్నారు.
ప్రస్తుతం ఫించ న్ల పంపిణీ విధానం నడి రోడ్డు మీద ఇండ్ల బయట ఫించను దారుని నిలబెట్టి దానం ఇస్తున్న తీరుగా పదిమంది ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్న ధోరణి వాటిని ఫేస్ బుక్, వాట్స ప్ గ్రూపుల్లో పోస్టు చేయడం వివిధ వర్గాల రాజకీయ పైత్యాలకు పరాకాష్టగా తయారయ్యిందన్నారు. బతికి చెడ్డ కుటుంబాలు వుంటాయన్నారు.
వారి ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం వలన ఎంతో మంది చెప్పు కోలేని మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు. సామాజిక ఫించన్లు పంపిణీ ప్రచారం వికృతంగా తయారవుతున్న తీరు పట్ల మానవ హక్కుల కమీషన్, రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం వుందని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు కోరారు.

