Viral

ప్లాస్టిక్ బ్యాగుల నిర్మూలనకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ పిలుపు…

WhatsApp Image 2024-03-01 at 3.45.10 PM

రోజువారీ వాడకంలో ప్లాస్టిక్ బ్యాగులు, కవర్ల నిర్మూలనకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ కాకినాడ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చింది. అందుకోసం తమ వంతు జిల్లా వ్యాప్తంగా జూట్ బ్యాగుల పంపిణీని ప్రారంభించింది. జిల్లా పరిథిలోని వివిధ ప్రాంతాల్లో జూట్ బ్యాగులను ఫౌండేషన్ ప్రతినిధులు పంపిణీ చేశారు.

బ్యాగులను అందజేస్తూ ప్లాస్టిక్ బ్యాగుల వల్ల కలిగే అనర్థాలను వివరించడంతో పాటు వాటికి ప్రత్యామ్నాయ వినియోగ వస్తువుల పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… జిల్లాలో ప్లాస్టిక్ బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునివ్వాలని ప్రముఖ సామాజికవేత్త సానా సతీష్ బాబు సంకల్పించారన్నారు.

ఆయన ఆలోచనలను ప్రజలకు చేరువ చేసేందుకు జూట్ బ్యాగుల పంపిణీ ప్రారంభించామన్నారు. కిరాణా దుకాణదారులు, చిరు వ్యాపారులు వీలైన ప్రతి వస్తువు విక్రయంలో ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులకు బదులుగా పేపర్ బ్యాగులు, పేపర్ పౌచ్ లు, జూట్ బ్యాగుల వంటివి వినియోగించాలని కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.