గుజరత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్రంలో సురేంద్రనగర్ జిల్లా మూలి ప్రాంతంలో ఒక బస్సు క్రింద పడి మహిళ మరణించింది. బస్సు రోడ్డుపై వెళ్తుండగా అటువైపుగా వెళ్తున్న మహిళ చూసుకోకుండా అక్కడ రోడ్డు పై ఉన్న గుంటలో పడిపోయింది. దానితో ఆ మహిళ బస్సు వెళ్తున్న వైపుకుపడంతో బస్సు వెనకి చక్రం ఆమె తల మీదుగా వెళ్లింది. దానితో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అటువైపుగా బండి మీద వెళ్తున్న వ్యక్తి వెంటనే స్పందించి ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో మహిళ మృతి…???
