కోవిడ్-19 కేసుల పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్, కే.సీ. జనరల్ హాస్పిటల్, జయనగర్ జనరల్ హాస్పిటల్, సి.వి. రామన్ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్‌లను ఐసోలేషన్ వార్డులను, COVID-19 రోగులకు కనీసం 10 సాధారణ పడకలు, 5 ICU పడకలు రిజర్వ్ చేయాలని రిజర్వ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నాయని, రానున్న రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున, రోగులు చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చినప్పుడు వారిని చేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టి.కె. అనిల్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో శనివారం 201 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో ఒకరు మరణనించినట్టు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో పడకలను రిజర్వ్ చేయాలి… – రాష్ట్ర ప్రభుత్వం-
