తక్కువ జీతమే అయినా అపరిమిత సేవలు అందిస్తున్న ఏ.పీ. అంగన్వాడి, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర సీ.ఏం. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి లేఖ వ్రాసింది. వారి సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్ లో వున్నందున ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికగా వాటిని పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు మాట్లాడుతూ… అంగన్ వాడీ, మున్సిపల్ కార్మికులకు కనీసవేతనం రు. 26 వేలు ఇవ్వాలన్నారు.
వారి గ్రాడ్యుటీ ఆప్ గ్రేడ్ ప్రమోషన్లు టీ.ఏ., డీ.ఏ. బకాయిల విడుదల చేయాలన్నారు. కరోనా లో మరణించిన బాధిత కుటుంబాలకు రు.50 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. తక్షణ చర్యలు వహించకుంటే రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రజలకు ప్రభుత్వం దూరం అయ్యే అవకాశం వుంటుందన్నారు.

