రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకుని అదనంగా ప్రభుత్వం ధనం వెచ్చించి దేశం ఎక్కడా లేని విధంగా విటమిన్ B12, ఐరన్, జింక్ వంటి విటమిన్స్ కలిపిన కెన్నాల్స్ ప్రజల ఆరోగ్య కోసం 50కేజిల బియ్యం గాను 500గ్రాముల బియ్యం కలపడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఆహర కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్ అన్నారు. వంట వాడినప్పుడు బియ్యం తేలుతాయని అవి మళ్లీ ఎసరులో వేసి వండితే అన్నంలో కరిగిపోతాయని ఆయన తెలిపారు. పోర్టిఫైడ్ బియ్యం తినడం ద్వారా ప్రజలకు రక్తహీనత లాంటి సమస్యలు ధూరం అవుతాయి చెప్పారు. ప్రతిపక్షాలు, అకాతాయిలు చేసే అసత్యప్రచారాలకు దూరంగా ఉండాలనిఆయన అన్నారు. కరోణ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్య దృష్ట్యా అంగనవాడీ పాఠశాలలు రేషన్ బియ్యంలో ఇవ్వడం దార్వ ప్రజలకు మరింత మేలు జరుగుతుందని జక్కంపూడి కిరణ్ అన్నారు. మిగతా రాష్ట్రలు కూడా ఇలాగే పొర్డఫైడ్ బియ్యం ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అన్నారు.
ప్రభుత్వం ఇస్తున్న బియ్యం పాస్టిక్ బియ్యంకాదు… -ఆహర కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్-

