ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం రామాపురానికి చెందిన రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు పి. వెంకట రమణ శుక్రవారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని మంగళగిరి కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్బంగా మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్ భావజాలానికి ఆకర్షితులైన వెంకట రమణ తనకు వచ్చే ఒక నెల పింఛన్ సొమ్ము రూ.61,116 పార్టీకి విరాళంగా ఇచ్చేందుకు డి.డి.ని తీసుకొచ్చారు.
ఆయన పెద్దమనసును అర్ధం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆ విరాళాన్ని సున్నితంగా తిరస్కరించారు. వెంకట రమణ తో సంభాషించి కుటుంబ వివరాలు, ఉద్యోగ విరమణ తరవాత జీవితం గురించీ తెలుసుకున్నారు. వెంకట రమణ గారు పట్టుబట్టడంతో 10 రూపాయిలు విరాళంగా తీసుకొని ఆయనను గుండెలకు హత్తుకున్నారు.

