తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలుకుతూ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన మద్దతును కోరుతున్న వీడియోను కర్ణాటక ప్రతిపక్ష నేత ఆర్ అశోక సోమవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును మెచ్చుకున్న అశోక్ కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌లపై విరుచుకుపడ్డారు. ఒక రాష్ట్రానికి బాధ్యతగల మరియు రాజనీతిజ్ఞుడైన ముఖ్యమంత్రి ప్రధానితో ఇలాగే ప్రవర్తించాలని అన్నారు. దయచేసి చిన్న పార్టీ రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి మరియు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా ఉంచాలో తెలంగాణలోని మీ చిన్న సహోద్యోగి నుండి నేర్చుకోండి అని హితబోదు చేసారు.
ప్రధాని మంత్రి మత్లాబ్ బడే భాయ్… -తెలంగాణ సీ.ఎం. రేవంత్ రెడ్డి-

