ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న 56 సబ్ ప్లాన్ గ్రామాలను ఐ.టీ.డీ.ఏ. లో వీళ్లను చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నా జగన్ సర్కార్ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 35,000 మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు లేక గిరిజనులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
వారి హక్కులు పూర్తిగా అనిచివేయపడుతున్నాయి. ఇటు షెడ్యూల్ గ్రామాల్లో కలపక అటు ఐ.టి.డి.ఏ. పరిధిలోనికి కలపక పోవడంతో స్థానిక గిరిజనులు ఎటువంటి హక్కులు పొందలేకపోతున్నారు. అభివృద్ధి అనేది కనిపించడం లేదని ఎవరికి సంక్షేమం పథకాలు అందడం లేదని పెద్ద మల్లాపురం కేంద్రంగా మండలా నీ ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
ప్రత్తిపాడు సబ్ ప్లాన్ గ్రామాలను పట్టించుకోరా…

