కోనేరు రంగారావు కమిటీ సిఫారసులు మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అతి నిరుపేద వ్యవసాయ కూలికి రెండు ఎకరాల సాగుభూమి మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు కొత్తగా వచ్చే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం పిఠాపురం నియోజకవర్గం ఆనందనగరం, గోర్చా తదితర ప్రాంతాలలో ఉపాది హామీ పనుల వద్దకు వెళ్లి సమావేశాలు నిర్వహించారు. అక్కడే బీ.కే.ఎం.యూ. సభ్యత్వాలు చేర్పించడం జరిగింది. ముఖ్య అతిథులుగా మధు తో పాటు ఏ.ఐ.టి.యు.సి. జిల్లా కోసాదికారి కే. బోడకొండ, రైతు సంఘము నాయకులు పి. సత్యనారాయణ , బీ.కే.ఎం.యూ. జిల్లా ఉపాధ్యక్షులు శాఖ రామకృష్ణ, సహాయ కార్యదర్శి నక్క శ్రీనువాస్ రావు హాజరయ్యారు.
ప్రతి నిరుపేదకు రెండు ఎకరాల సాగు భూమి మంజూరు చేయాలి…

