కాకినాడ జిల్లాలోని జగ్గంపేట మండలం ఇర్రిపాకలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షుడు, మాజీ ఎం.ఎల్.ఏ. జ్యోతుల నెహ్రూ ఈనెల 26 వ తేదీ నుంచి మార్చ్ 7వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ మహా రుద్రాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఒకే చోట మట్టిలింగాలను తయారుచేసి అదే చోట మహా కుంభాభిషేకం చేయడం ఇప్పటివరకూ ఎక్కడా జరగలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ, టీ.డీ.పీ. కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ప్రతిష్టాత్మకంగా ఇర్రిపాక లో కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం…
