చట్ట ప్రకారం తనకు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ జనరల్‌ను ఆదేశించాలని కోరుతూ వై.ఎస్.ఆర్.సీ.పీ. అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అసెంబ్లీ స్పీకర్ సీ.హెచ్. అయ్యన్నపాత్రుడు, ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌లను ప్రతివాదులుగా చేస్తూ.. ప్రతిపక్ష నేత హోదాపై స్పీకర్ మౌనంగా ఉన్నారని జగన్ అన్నారు.
ఈ కేసులో స్పీకర్ విచక్షణాధికారాలను అనుమతించవద్దని, రాజ్యాంగ సూత్రాలను వర్తింపజేయాలని ఆయన హైకోర్టును కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు.

