మూడు అత్యాచార కేసుల్లో నిందితుడిగా ఉన్న కర్ణాటక ఎం.పీ. ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేసిన విషయం తేలిసిందే. అయితే ఇప్పుడు ఆరు రోజుల పోలీసు కస్టడీలో ఉన్నట్లు అధికారులు తేలిపారు. రేవణ్ణ ఇంట్లో పనిమనిషిగా పనిచేసిన వృద్ధురాలిపై అత్యాచారం చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం అతన్ని అదుపులోకి తీసుకుంది.
ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక కోర్టులో హాజరుపరచడం, బెంగళూరులోని బౌరింగ్ మరియు లేడీ కర్జన్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు వంటి లాంఛనాలను పూర్తి చేసారు. కర్ణాటక ఎం.పీ. కి ప్రశ్నోత్తరాల ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమవుతుందని సిట్ అధికారులు తెలిపారు. పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో అతన్ని సిట్ ప్రధాన కార్యాలయానికి తరలించారు.
