మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల నుండి దేశాన్ని, దేశ ప్రజలను కాపాడాలని, కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా భారత్ విప్లవ కమ్యూనిస్టు పార్టీ తమ కార్యాలయంలో ప్రెస్ మీట్ నునిర్వహించారు. అనంతరం కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్.సి.పి.ఐ. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రంబాల సతీష్ మాట్లాడుతూ… ఒక పక్క కేరళ, తమిళనాడు, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలు తమ ఫెడరల్ హక్కుల కోసం ఢిల్లీ బాట పట్టి ఉద్యమాలు చేస్తూ ఉంటే, మరోపక్క దేశ రైతాంగం పెద్ద ఎత్తున ఢిల్లీ పోయి మోడీని నిలదీస్తూనాయన్నారు.
కాని ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ మరియు ప్రతిపక్షాలు మోడీపై కనీసం మాట కూడా మాట్లాడకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కాదని, భవిష్యత్తు కోసం కాదని చూస్తుంటే అర్థమవుతుందని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో బి.జె.పి. కి మద్దతు ఇచ్చే పార్టీలను ఓడించాలని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ పిలుపునిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి. మంగ, బొత్స యేసు, శివకోటి రాజు, బి. ప్రసాద్, బి. పద్మ, తదితరులు పాల్గొన్నారు.

