దేశంలో ప్రజాలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న బీ.జే.పీ. పార్టీని, రాష్ట్రం లో వై.సీ.పీ. పార్టీలను పథవినుంచి దింపడమే లక్ష్యం గా ఆర్.పి.ఐ (అంబేద్కర్ ) ప్రజలను చైతన్యం చేస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డా. మోహన్ లాల్ పాటిల్ తెలిపారు. విజయవాడలో సన్ రైజ్ ఆసుపత్రి సమీపంలో పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం పూర్తి, విశాఖ ఉక్కు, విషయం లో అన్యాయం చేసిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు రద్దు, జాబ్ క్యాలెండర్ ప్రకటించడం లో నిర్లక్ష్యం వహించిందని రాష్టానికి రాజధాని లేకుండా చేసిందని ఆందోళన వ్యక్తంచేసారు. రాష్ట్రంలో మత్తు పదార్దాలు వాడకం పెరిగి హత్యలు, మానభoగాలు పెరిగి ప్రజలకు శాంతి భద్రతలు కరువై ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

