తిరుపతి నగరం 4వ వార్డులో రేణిగుంట బ్లిస్ హెూటల్ పరిసర ప్రాంతాలు, తిరుచానూరు రోడ్, తదితర ప్రాంతాలలో ప్రజా చైతన్య యాత్ర కార్యాక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ శీతల రాజేష్ రాయల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు కె. చంద్రబాబు, పార్లమెంట్ కోఆర్డినేటర్ నీరు గట్టు నగేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి పేదవాడు ఆమ్ ఆద్మీ పార్టీకే మద్దతు తెలుపుతున్నారని పార్టీ చేపట్టిన సామాన్యుడి శంఖారావం ప్రజా చైతన్య యాత్రలో ప్రజల స్వచ్ఛందంగా పార్టీలో ఆ సభ్యత్వం తీసుకుంటున్నారని తెలియజేశారు. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు ప్రతీ ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మహేష్ బాబు, తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ శీతల రాజేష్ రాయల్, తదితరులు పాల్గొన్నారు.
