Political

ప్రజలూ సిద్థమే…

WhatsApp Image 2024-02-11 at 11.14.39 AM

అధికార పార్టీకి బుద్ది చెప్పేందుకు ప్రజలూ సిద్దంగానే ఉన్నారని జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇంచార్జ్‌ ముత్తా శశిధర్‌ అన్నారు. స్థానిక మెయిన్ రోడ్డు సూపర్ బజార్ వద్ద జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి శివ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్య్రమానికి ఆయన హాజరయ్యారు. ఇంటిపన్ను, నీటి పన్ను, చెత్తపన్నులు అధికంగా విధించి ప్రజలను కాకినాడ సిటీ విడిచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోయోలా కుట్రజరుగుతోందని జనసేన పార్టీ ఇంచార్జ్‌ ముత్తా శశిధర్‌ అరోపించారు. కాకినాడ నగరంలో పన్నులు పేరుతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ద్వారంపూడి పరోక్ష పద్ధతిలో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో ఇప్పటికే 28,000 కుటుంభాలను నగరం నుంచి గ్రామీణ ప్రాంతానికి వెళ్లగొట్టారని దుయ్యబట్టారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.