ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాది పౌల్ట్రీ పరిశ్రమలను వనికిస్తోంది. బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి చెందాయి. గత వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయినట్లు వెళ్లడించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం చికెన్ దుకాణాలను మూసివేయాలని ఆదేశాలిచ్చారు. పౌల్ట్రీలు ఎక్కువగా ఉండే కృష్ణా, గోదావరి జిల్లాలతో పాటు విదేశీ పక్షులు వచ్చే నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేసి నమూనాలు సేకరిస్తున్నామని వెళ్లడించారు. ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో పౌల్ట్రీ రవాణా పై ఆంక్షలు విదించామని ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది.
పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ…
