లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామిక వాదులు అనునిత్యం అప్రమత్తంగా వుండాలని పరిరక్షణ వేదిక అధ్యక్షులు అయితాబత్తుల రామేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఇంద్రపాలెం రాజగృహ మందిరంలో వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… మార్చి30 శనివారం ఉదయం 10 గంటలకు కాకినాడ సిటీ కచేరీపేట యు టి ఎఫ్ మీటింగ్ హాలులో విస్తృత సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. ఆహ్వాన పత్రికలను వేదిక బృందం ఆవిష్కరిం చింది.
శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కె.యస్. లక్ష్మణ రావు ఐ.ఎఫ్.టి.యు. రాష్ట్ర అధ్యక్షులు పి. ప్రసాద్ ముఖ్య అతిధులుగా పాల్గొంటారని కాశీ బాలయ్య ప్రకటించారు. ముఖ్య అతిథులు తెలియజేసే అమూల్య విషయాలు గ్రహించి భవిష్యత్ కార్యాచరణ పట్ల సమైక్యత వహించాలని హాసన్ షరీఫ్ పేర్కొన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన్, బుద్ధ, మున్నగు అన్ని మతాలవారు సదస్సులో పాల్గొనాలని పౌరసత్వ సవరణ చట్టం గురించి అధ్యాయనం చేయాలని నరాల శివ కోరారు.

