కాకినాడ పెద్ద మార్కెట్ నందు ఎన్నో సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్న పేదవాడు ఉపాధిని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి దెబ్బకొట్టి తను అనుచరులకు లబ్ధి చేకూరిస్తున్నాడని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. పెద్ద మార్కెట్లో నెలకొన్న సమస్యలపై కొండబాబు వ్యాపారస్తులతో సమావేశమైనారు. మార్కెట్లో నెలకొన్న పలు సమస్యలను వ్యాపారస్తులు కొండబాబు దృష్టికి తీసుకువచ్చారు. 1930లో నిర్మించిన పెద్ద మార్కెట్ గోడను ఎమ్మెల్యే అనుచరులు పగలకొట్టడాన్ని
పరిశీలించి ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ… ఎన్నో ఏళ్ళుగా కాకినాడ పెద్ద మార్కెట్లోని వ్యాపారస్తులు పలు వ్యాపారాలు నిర్వహించడం జరుగుతుందని, అదే విధంగా రోడ్డును అనుకుని వ్యాపారాలు చేసుకుంటూ అనేక కుటుంబాలు జీవనం కొనసాగిస్తుండగా, మార్కెట్ సమస్య కోర్టులో ఉండగా మున్సిపాలిటీ నుండి ఎటువంటి అనుమతి లేకుండా కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి బ్రిటిష్ కాలంలో నిర్మించిన మార్కెట్ గోడను కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రధాన అనుచరుడు డేగల శ్రీరామ్ తొలగించడం జరిగిందని, మార్కెట్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చేయడం జరుగుతుందని తెలిపారు.
.

